Allu Arjun,Manoj And Many More Telugu Actors React On Pulwama Incident | FilmiBeat Telugu

2019-02-15 1

Allu Arjun, Nani, Manchu Manoj, Allu Sirish, Nikhil Siddharth, Kona Venkat, Rakul Preet Singh, Thapsi and others have expressed their grief over the death of the jawans through Twitter. The words are not enough to describe this pain, saying that the sacrifices of heroes are unreachable.
#pulwamaattack
#nani
#manchumanoj
#crpfjawans
#alluarjun
#surya
#purijagannadh
#priyankachopra

కాశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై గురువారం జరిగిన ఉగ్రవాదుల దాడిపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనలో దాదాపు 44 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిన ప్రతి భారతీయుడు కోపంతో రగలిపోతున్నారు. ఈ రాక్షస ఉగ్రదాడిపై సినీ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా స్పందించారు.

పుల్వామాలో జరిగిన దాడి ఘటనలో సిఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన విషయం తెలిసి షాకయ్యాను. ఇది చాలా దుర్దినం. వారి కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేస్తున్నాను. తమ ప్రాణాలు త్యాగం చేసిన ప్రతి జవాను ప్రజల గుండెల్లో నిలిచిపోతాడు. అని అల్లు అర్జున్ ట్వీట్ చేసాడు.

‘మరో సర్జికల్‌ స్ట్రయిక్‌ అవసరం ఏర్పడింది. మార్ సాలేకో (వారిని చంపిపడేయండి)... అని పూరి జగన్నాథ్ ట్వీట్ చేశారు.
మన యుద్ధ వీరులకు ఎక్కడా సెక్యూరిటీ లేదు. పుల్వామా దాడి గురించి తెలిసిన వెంటనే చాలా బాధేసింది. ఈ దాడికి కారణమైనా వారికి మరణశిక్ష వేయాలి, చనిపోయిన జనవాన్ల కుటుంబాల్లో ధైర్యం నింపాలి. అని మనోజ్ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.
సల్మాన్ ఖాన్ మన దేశాన్ని, మన కుటుంబాలను కాపాడటానికి వారి ప్రాణాలు త్యాగం చేశారు. ఈ సంఘటన గురించి తెలియగానే బాధేసింది. అని సల్మాన్ ట్వీట్ చేసాడు
పుల్వామా దాడి ఘటన గురించి తెలిసి షాకయ్యాను. ద్వేషం అనేది ఎప్పటికీ సమాధానం కాదు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జనాన్ల కుటుంబాలకు దేవుడు మనోదైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను అని ప్రియాంక చోప్రా ట్విట్టర్ లో పోస్ట్ చేసారు
సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి జరిగిన విషయం తెలిసి షాకయ్యాను. ప్రేమ వికసించే రోజున మన హీరోలను కోల్పోయాం. వారి కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేస్తున్నాను. అని నాని ట్వీట్ చేసాడు!!